News

భగవద్గీత పోటీలు విజయవంతం

509views

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో స్థానిక గిరి కై లాస క్షేత్రంలోని ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పోటీలు విజయవంతంగా సాగాయి. ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఇతర ఆధ్యాత్మిక కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు భక్తిభావంతో భగవద్గీత శ్లోకాలను ఆలపించారు.ఈ పోటీలో పెద్దసంఖ్యలో పాల్గొని చక్కటి కంఠస్వరంతో భగవద్గీత శ్లోకాలను పఠించారు. న్యాయ నిర్ణేతలుగా ఆలయ గౌరవ అధ్యక్షులు తుడుము బాబూరావు, బొజ్జ త్రినాథ్‌, రవికుమార్‌, తమర్భ రమేష్‌కుమార్‌, ఎస్‌.సీతమ్మ వ్యవహరించారు. విజేతలకు ఉగాది పర్వదినం నాడు ఉత్తమ పురస్కారాలు అందజేయనున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కొట్టగుళ్లి రామారావు, దేశిది బాబూ రావు, రాజుబాబు, సోమరాజు పాల్గొన్నారు.