
299views
వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ హోలీ. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా హోలీని జరుపుకుంటున్నారు. ఈక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ సైతం ప్రజలతో కలిసి హోలీ ఆడారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
వాణిజ్యం, పెట్టుబడుతో సహా కీలక అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు ఆయన మార్చి 16 నుంచి 20 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. తాను భారతదేశానికి పెద్ద అభిమానినని ఆయన అనేకసార్లు పేర్కొన్నారు.





