News

రాయచోటిలో హిందువులపై ముస్లింల దాడి ఖండించిన విశ్వ హిందూ పరిషత్

504views

విశ్వ హిందూ పరిషత్ – ఆంధ్రప్రదేశ్
పత్రికా ప్రకటన

అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2025 మార్చి 4వ తేదీన జరిగిన వీరభద్ర స్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ముస్లింలను అదుపుచేయడంలో విఫలమవడమేకాకుండా, పక్షపాతధోరణితో హిందువులపైనే అమానుషంగా లాఠీచార్జిచేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. ప్రతి సంవత్సరము చేసుకునే ఉత్సవంలాగే ఈ సంవత్సరం కూడా హిందువులు ఉత్సవం జరుపుకుంటుంటే ముస్లిములు దాడి చేయడం, దానికి పోలీసులు తగు రక్షణ చర్యలు చేపట్టక పోవడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది. రాయచోటిలో ఊరేగింపు జరుపుకొనుటకు అన్ని అనుమతులు తీసుకొని ఉత్సవాన్ని నిర్వహించుకుంటుంటే ఆ ఉత్సవానికి ఆటంకాలు కలగకుండా చూడవలసిన బాధ్యత పోలీసులది. ప్రశాంతంగా తమ ఉత్సవాలు తాము నిర్వహించుకునే హిందువులను, హిందూ సంస్థలను బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టడాన్ని VHP ఖండిస్తున్నది.

హిందువులపైన, వారి ఉత్సవాలపైన ముస్లింలు దాడులు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబరులో చిత్తూరు జిల్లలోని V.కోటలో, కృష్ణా జిల్లాలోని పెడనలో కూడా హిందువులపై, వారి ఉత్సవాలపై ముస్లింలు ఇలాగే దాడులు చేశారు. హిందువులపైనే కాకుండా, పోలీసులు పైన, పోలీస్ స్టేషన్ల పైన కూడా ముస్లింలు దాడులు చేస్తుంటే వారి మానసిక స్థితిని పోలీసులు గుర్తించకపోగా, దాడులు జరిగిన ప్రతిసారీ హిందువులను బాధ్యులు చేసే ప్రయత్నం చేయడం పోలీసుల వైఫల్యంగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది.

ఈ సంఘటన జరిగిన సందర్భంలో రాయచోటి అర్బన్ 3 అర్బన్ స్టేషన్ SI శ్రీ J. నరసింహారెడ్డి గారు హిందువులను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఆయన ప్రవర్తనను VHP ఖండిస్తున్నది. హిందువులను, హిందూ సంస్థలను కించపరిచే విధంగా వారు పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సంఘటనలో వారి చర్యలను అనుమానించవలసి వస్తున్నది. దీనికి కారణం వారు సంఘటన జరిగిన సందర్భంలో స్త్రీలను, వృద్ధులను, భక్తులను నిందాపూర్వకంగా మాట్లాడడమే కాకుండా, వారిపై లాఠీచార్జి చేసి తీవ్రంగా కొట్టారు. ఒక పథకం ప్రకారం వారు హిందువులపై దాడి చేసి తిరిగి హిందువులను, హిందూ సంస్థలను కేసుల్లో ఇరికించే కుట్ర చేయడం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం చేసిన పక్షపాత చర్యగా మేము భావిస్తున్నాం. సీదరు SI గారు పెట్టిన కేసు తీరును, కేసులో వారు ప్రస్తావిస్తున్న అంశాలు చూస్తుంటే ఇది ముందస్తు పథకం, ప్రణాళిక ప్రకారం జరిగిన ఒక కుట్రగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది. ముస్లిములను వెనకేసుకు వస్తూ, హిందువుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించిన స్థానిక SI గారిని వెంటనే విధుల నుంచి తొలగించి వారిని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము.

పెడనలో పోలీసులపైనే దాడులు చేసి, వారిని గాయాలపాలు చేసినా వారిపై చర్యలు తీసుకునే దైర్యం పోలీసులకు లేక, వాట్సాప్ లో ఆ సమాచారం పెట్టారని హిందువులపై కేసులు పెట్టే ప్రయత్నం చేసిన పోలీసుల తీరును హిందూ సమాజం ఇంకా మర్చిపోలేదు. అదే విధంగా V. కోటలో కూడా దాడికి గురైన హిందువులని దోషులుగా చేస్తూ వారి పైన కేసులు నమోదు చేశారు. అదే సందర్భంలో నెల్లూరులో పోలీస్ స్టేషన్ పై దాడి, గుంటూరులో పోలీస్ స్టేషన్ దగ్ధం చేసినటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేయకపోవడం, పెట్టిన కేసులు ఉపసంహరించుకోవడం పోలీసుల పక్షపాత ధోరణికి ఉదాహరణలుగా భావిస్తున్నాం.

హిందువుల ఉత్సవాలు ఊరేగింపులు సందర్భంగా ముస్లింలు హిందువులపై దాడులు చేస్తారనే భయంతో హిందువుల ఉత్సవాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు పెంచడాన్ని VHP ఖండిస్తున్నది. నిన్న రాయిచోటిలో హిందువులు ఏ నినాదాలు పలకాలి, ఎవరు ఉత్సవంలో పాల్గొనాలి అని పోలీసులే పేర్కొనడం నియమాలకు విరుద్ధం. పెడనలో చుట్టుపక్కల గ్రామాల నుంచి దాడి చేయడానికి వచ్చినప్పుడు స్పందించని పోలీసులు, భగవంతుని ఉత్సవం కోసం రాయచోటిలో పరిసర గ్రామాలనుంచి భక్తితో పార్వేట ఉత్సవంలో భక్తులు పాల్గొంటే మీకు రాయిచోటి రావాల్సిన అవసరం ఏమిటని పోలీసులు ప్రశ్నించడాన్ని వారి అధికార దుర్వినియోగంగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది. దాడులు జరిగిన ప్రతిసారి హిందువులనే బాధ్యులుగా చేస్తూ, కేసులు నమోదు చేస్తే ఇక హిందూ సమాజం ఎంత మాత్రమూ సహించదని తెలియజేస్తున్నాం.

ఈ సందర్భంగా సక్రమంగా ఉత్సవ రక్షణ విధులు నిర్వర్తించని మరియు బాధిత హిందువులపై తప్పుడు కేసులు పెట్టిన SI గారిని వెంటనే సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని, హిందువులపై పెట్టిన కేసులు ఉపసంహరించు కోవాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 10వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద సంఖ్యలో హిందువులందరూ పాల్గొని నిరసన ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మెమోరాండం సమర్పించాలని యావత్ హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ పిలుపుఇస్తున్నది.

తనికెళ్ళ సత్య రవికుమార్
విశ్వ హిందూ పరిషత్
క్షేత్ర కార్యదర్శి