ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా బాపట్ల జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులతో విశ్వంజీ ప్రత్యేక పూజలు చేయించారు. రాత్రి ఆడిటోరియంలో విశ్వణి కూచిపూడి నాట్య ప్రదర్శన, లోల మనస్వి, నిధిమల భరతనాట్య ప్రదర్శన, కౌటూరి గాయత్రి సంగీత విభావరి, ఫణికుమార్ వేణుగాన కచేరీలు అలరించాయి.
444views
You Might Also Like
బెంగాల్ పాఠ్యాంశాల్లో మార్పులు
2
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పాఠశాల విద్యా వ్యవస్థలో 2028 విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. పాఠ్యాంశాలు, సిలబస్‌తో పాటు చరిత్ర, బెంగాలీ...
ఆలయ భూమిలో చర్చి నిర్మాణం వివాదం.. రాయచూర్‌లో హిందువులపై దాడి
6
రాయచూర్ (కర్ణాటక): ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన భూమి విషయంలో నెలకొన్న వివాదం రాయచూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బిచ్చాలి క్యాంప్‌లో హిందూ, క్రైస్తవ వర్గాల...
బంగ్లాదేశ్ సరిహద్దులో పాకిస్థానీ గూఢచర్య అనుమానితుడు అరెస్ట్..
8
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. బోంగావ్ ప్రాంతంలో పట్టుబడిన రాణా రౌత్ అనే వ్యక్తికి...
సావర్కర్‌పై ప్రశ్న అడిగిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌పై కేరళ హైకోర్టు ప్రశ్నలు
7
తిరువనంతపురం: స్వాతంత్ర్యవీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై ప్రశ్న రూపొందించినందుకు కేరళలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన వ్యవహారం ఇప్పుడు కేరళ హైకోర్టుకు చేరింది. ఉపాధ్యాయుడు గురుప్రసాద్ రాయ్...
రుద్రాక్ష ధరించడంపై హిందూ ఉద్యోగిపై వివక్ష ఆరోపణలు.. కాన్సెంట్రిక్స్పై పోలీసులకు ఫిర్యాదు
8
పూణే: పూణేలోని విమాన్ నగర్ ప్రాంతంలో ఉన్న బహుళజాతి ఐటీ సంస్థ కాన్సెంట్రిక్స్పై మత వివక్షకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సంస్థలో పనిచేసిన హిందూ ఉద్యోగి...
బంగ్లాదేశ్‌లో అల్‌ఖైదా స్థావరాలపై ఐరాస హెచ్చరిక!
78
బంగ్లాదేశ్‌ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) అక్కడ ఉగ్రవాద సెల్స్‌ను ఏర్పాటు...




