News

హిందూ ధర్మరక్షణే ధ్యేయం

246views

హిందూ ధర్మరక్షణే ధ్యేయమని త్రిదండి చిన జియర్‌ స్వామి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం టౌన్‌ పోలీసు స్టేషన్‌ వీధిలో గల ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో తీర్ధగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న జియ్యర్‌ స్వామి మా ట్లాడుతూ ఆధ్యాత్మిక, భక్తిమార్గం ద్వారా ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. కాగా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ దంపతులకు ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో వికాసతరంగిణి పార్వతీపురంశాఖ అధ్యక్షుడు ఐ.గున్నేష్‌, తదితరులు పాల్గొన్నారు.