
అనంతపురం జిల్లాలో అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఈవోలతో సమీక్షా సమావేశంలో ఆయన ఈవోలను ఈ మేరకు ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 3500 దేవాలయాలు దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 44610.83 ఎకరాల ఆలయ భూములు ఉండగా, వాటిలో సుమారు 6900.83 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు తేలిందని, మరి కొన్ని చోట్ల కూడా దేవాలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.
వాటన్నిటినీ గుర్తించి ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమణలపై ప్రజలు కూడా ప్రభుత్వానికి సమాచారం అందించాలని కోరారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





