
పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 16 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించే సభకి కోల్ కత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా సౌండ్ లెవల్స్ ని తక్కువగా వుంచుకోవాలని సూచించింది. ర్యాలీని, సభను ప్రశాంతంగా జరుపుకోవాలని, గంట 15 నిమిషాలు మాత్రమే జరుపుకోవాలని సూచించింది. పరీక్షలకు అంతరాయం కలిగించకూడదని హైకోర్టు సూచించింది.
పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయన్న సాకుతో ఆరెస్సెస్ సభకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమతిని నిరాకరించారు. కనీసం సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడానికి కూడా వీలు లేదని ఆంక్షలు విధించింది. దీనిని సవాల్ చేస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కోల్ కత్తా శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.పదో తరగతి పరీక్షల కారణంగా అనుమతి నిరాకరించారని కోర్టులో పిటిషనర్ వాదించారు.దీంతో జస్టిస్ అమృత సిన్హా స్పందిస్తూ.. ఆదివారమని ముందే ప్రకటించారని, కేవలం గంటా 15నిమిషాల కార్యక్రమమే కాబట్టి… ఎవ్వరికీ కష్టం వుండదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే… అక్రమ వలసదారుల సమస్య కలకత్తాలో విపరీతంగా పెరిగిపోయింది. మమతా బెనర్జీ తన స్వార్థ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ సభ ప్రాముఖ్యాన్ని కలిగి వుందని పరిశీలకులు అంటున్నారు. ఎలాగైనా ఆరెస్సెస్ సభను అడ్డుకోవాలని సీఎం మమత భావించారు. దీనిపై జాతీయవాదుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి న్యాయ స్థానం సభకు అనుమతిని ఇచ్చింది.





