
277views
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శివ స్వాముల ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన కొవ్వూరి విజయషణ్ముఖరెడ్డి (పొర్లుదండాల స్వామి) 3 కిలోమీటర్ల దూరం పొర్లుదండాలు పెట్టారు. రావులపాలెం మండల కేంద్రం ఆదిలక్ష్మీనగర్‌లోని శివస్వాముల శిబిరం వద్ద నుంచి స్థానిక రింగ్‌రోడ్డు కూడలి వరకు పొర్లుదండాలు పెట్టుకుంటూ వచ్చారు. ఆయన వెంట స్వాములు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విజయషణ్ముఖరెడ్డిని అంతాకలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి గొలుగూరి వెంకటరెడ్డి, సూరిబాబు, ఎస్‌వీఆర్ కృష్ణారెడ్డి, రామారెడ్డి, కేబుల్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.





