
భువనేశ్వర్ లోని ‘శిక్షా ఓ అనుసంధాన్’ యూనివర్సిటీలోని రెండవ ప్రాంగణంలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ఆర్. ఎస్. ఎస్ అత్యున్నత స్థాయి సమావేశాలైన అఖిల భారతీయ కార్యకారీ మండల్ (ABKM) సమావేశాలు జరుగనున్నాయని ఆర్. ఎస్. ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సమావేశాలలో ఆర్. ఎస్. ఎస్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ డాక్టర్ మోహన్ భాగవత్, మాననీయ సర్ కార్యవాహ సురేష్ (భయ్యాజీ) జోషిల తోపాటు ఆర్. ఎస్. ఎస్ కు చెందిన అఖిల భారత, క్షేత్ర, ప్రాంత అధికారులందరితో కలిపి మొత్తం 400 మంది కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇది ప్రతి ఆరు నెలలకొకసారి అఖిల భారత స్థాయిలో జరిగే సమీక్షా సమావేశమని, మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలోసంస్థ కార్యక్రమాలు, సంస్థ విస్తరణ, కార్యకర్తల శిక్షణ, కార్యకర్తల అనుభవాలు వంటి అంశాలపై చర్చ జరుగుతుందని ఆయన వివరించారు. కాగా ప్రతి ఏడాది మార్చిలో జరిగే అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలలో మాత్రమే వార్షిక కార్యక్రమాల యోజన చేయబడుతుందని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





