News

బాధ్యతలు స్వీకరించిన తొలి అంథ మ‌హిళా ఐఏఎస్‌ ప్రంజ‌ల్ పాటిల్

549views

హారాష్ట్ర ఉల్హాస్ నగర్ కు చెందిన ప్రంజల్ పాటిల్ కంటిచూపు లేకున్నా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రంజల్ పాటిల్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కే. గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో సబ్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నారు. ప్రంజల్ పాటిల్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకుని దేశంలోనే తొలి అంథ ఐఏఎస్ అధికారిణిగా రికార్డుల‌కెక్కారు. 2017 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ప్రంజల్ పాటిల్ 124వ ర్యాంకు సాధించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.