News

స్నాతకోత్సవాలలో స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా చూడండి – రాష్ట్ర గవర్నర్ కి విద్యా వికాస సమితి విన్నపం

536views

ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలలో జరిపే స్నాతకోత్సవాలలో విద్యార్థులు ధరించే దుస్తులు స్థానిక సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించేవిగా ఉండాలని, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలకు మరియు ఇతర సంస్థలకు సూచించ వలసిందిగా విద్యా వికాస సమితి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వ భూషణ్ హరిశ్చంద్రన్ గారికి విన్నవించారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సంయోజకాలు శ్రీ కే దేశపతి రావు, శ్రీ బి ఆర్ సుధాకర్, శ్రీకృష్ణ ప్రసాద్ లు ఈ మేరకు గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దేశంలో అనేక రాష్ట్రాలలో వారి వారి స్థానిక సాంప్రదాయ దుస్తులలో స్నాతకోత్సవాలు జరుగుతున్నాయని, స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ నేటికీ మన రాష్ట్రంలో బ్రిటిష్ సాంప్రదాయాల్ని అనుసరిస్తూ ఉండడం బానిసత్వానికి ప్రతీక అని దాని స్థానంలో మన వేష భూషణాలలో నాటకోత్సవాలు నిర్వహించేలా చూడాలని వారు గవర్నర్ ని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.