News

వాసవీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

255views

వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి ఆత్మార్ప‌ణ దినోత్సవం సంద‌ర్భంగా అమ్మవారికి రాష్ట్రప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించింది. వాసవీ అమ్మవారి ఆత్మార్పణ రోజును ఇక నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెనుగొండ‌లో ప‌ర్య‌టించిన సీఎం చంద్రబాబు, వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఆర్యవైశ్యులపై ప్రశంసలు కురిపించారు. నీతిగా నిజాయితీగా నిరంతరం ఆర్యవైశ్యులు శ్రమిస్తారన్నారు. సంపాదనలో కొంతభాగం దానధర్మాలకు వినియోగించడం అభినందనీయమన్నారు.