
భూరికార్డుల దుర్వినియోగం, వారసత్వ స్థలాలను వక్ఫ్ బోర్డుకి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శ్రీరంగపట్నంలో రైతులు నిరసన కార్యక్రమాలు, బంద్ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానికులు, వ్యాపారులు, వ్యాపార సంస్థలు, రవాణా రంగం అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో శ్రీరంగ పట్నంలో రోజువారీ కార్యక్రమాలు స్తంభించాయి. ఈ బంద్ కి స్థానికులు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, రాణా సంస్థలతో పాటు అన్ని రంగాల వారు తమ మద్దతు ప్రకటించారు. రైతులకు అన్ని వర్గాల వారు తమ మద్దతును ప్రకటించారు. దీంతో రవాణా రంగం కూడా స్తంభించిపోయింది. వీరందరూ రైతులకు తమ మద్దతును ప్రకటించారు. అయితే.. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపును ప్రకటించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.
వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ భారీ ఆందోళనలు శ్రీరంగపట్నం పుర వీధులగుండా సాగింది. వారసత్వ స్థలాలను వక్ఫ్ బోర్డుకి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. భూరికార్డుల దుర్వినియోగాన్ని కూడా వ్యతిరేకించారు. చివర్లో బెంగళూరు మైసూరు జాతీయ రహదారిలోని కువెంపు సర్కిల్ ప్రాంతాల్లో భారీ నిరసన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.భూకబ్జా ఆరోపణలకు నిరసనగా వక్ఫ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మరియు రైతులకు చెందిన ఈ ఆస్తులు RTC (రికార్డ్ ఆఫ్ రైట్స్, టెనెన్సీ మరియు క్రాప్స్) భూ రికార్డులలో అన్యాయంగా వక్ఫ్ ఆస్తులుగా జాబితా చేర్చారని మండిపడ్డారు. ఈ విషయం రైతులు, ఆస్తులను పరిరక్షించే వారి విషయంలో తీవ్ర అసంతృప్తిని కలిగించిందని వక్తలు పేర్కొన్నారు. ASI పరిరక్షక కట్టడాలను కూడా వక్ఫ్ జాబితాలో చేర్చారని, అలాగే సాంస్కృతికమైన ప్రదేశాలను కూడా చేర్చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కిరణగూరు, కె.శెట్టహళ్లి, బాబరాయనకొప్పలు, దరసకుప్పే సహా చుట్టుపక్కల గ్రామాల రైతులు కష్టాలు చెప్పుకున్నారు. తమ భూములను కాపాడుకోవడానికి తాము నానా కష్టాలూ పడుతున్నామని అన్నారు. భూములే తమ జీవనాధారమని, రుణాలు అందక తమ భవిష్యత్తే అంధకారం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.





