News

సంఘమిత్ర ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా నేతాజీ జయంతి

332views

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి, నిరాశ్రిత బాలుర ఆవాసంలో భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రధాన కారకుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవం స్ఫూర్తిదాయకంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ఉపాధ్యక్షుడు శ్రీ జే వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్, సహ కార్యదర్శి శ్రీ సుందర్ రావు ప్రధాన వక్తగా,, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరి, శ్రీ వి. రమణయ్య గౌడు, ట్యూషన్ మాతాజీ లు, సంఘమిత్ర సిబ్బంది, చిన్నారులు, తదితరులు పాల్గొన్న సమావేశంలో ముఖ్య అతిథి గా జూనియర్ కాలేజ్ విశ్రాత ప్రిన్సిపాల్ శ్రీ లింగేశ్వర్ రావు పాల్గొన్నారు.

పూజతో ప్రారంభమైన కార్యక్రమంలో వక్తలు ధీరోదాత్తమైన నేతాజీ స్వాతంత్ర్య పోరాటాన్ని, ఆయన కూడగట్టిన విదేశాల మద్దత్తును, ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు, కరెన్సీ విడుదల గురించి చక్కగా వివరించారు. దేశభక్తి పూరితమైన ఆయన పోరాటం చరిత్ర మనకందరికి స్ఫూర్తి దాయకమని తెలిపారు.

శాంతి పాఠంతో కార్యక్రమం సంపన్నమైంది.