News

విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం

401views

ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన పార్వతీపురం మన్యం జిల్లా, తోటపల్లి వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామి వారి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5 నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి, తోటపల్లి ఆలయ అభివృద్ధి సేవా ట్రస్ట్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తోటపల్లి ఆలయ అభివృద్ధి సేవా ట్రస్ట్ సభ్యులు కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించారు. శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ మదభినవోద్దండ విద్యా శంకర భారతీ స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో ప్రతిష్ట కార్యక్రమాలు, ఫిబ్రవరి 8వ తేదీన వార్షిక కళ్యాణోత్సవం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7వ తేదీన యంత్ర ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు.