
515views
భారత వాయుసేనాధిపతిగా ఆర్కేఎస్ భదౌరియా నియమితులయ్యారు. కొత్త వాయు సేనాధిపతిగా ఆయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వాయుసేనాధిపతిగా ఉన్న బీఎస్ ధనోవా పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో వైస్ చీఫ్‌గా ఉన్న భదౌరియాకు ఆ బాధ్యతలను అప్పగించింది. భదౌరియా కూడా అదే రోజు పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ.. కేంద్రం ఆయన సర్వీసును మూడేళ్లు పెంచుతూ కొత్త చీఫ్‌గా నియమించడం విశేషం. వయసు రీత్యా అయితే భదౌరియా 62 ఏళ్లు వచ్చేవరకు అంటే మరో రెండేళ్లు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా కూడా ఆయన సేవలందించారు. మార్చి 2017 నుంచి ఆగస్టు 2018 వరకు ఆయన సదరన్ ఎయిర్ కమాండ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 36 ఏళ్ల తన సర్వీసులో ఆయన అనేక అవార్డులు సాధించారు. పలు సేవా పతకాలు అందుకున్నారు.






