
మన జాతీయ గీతం.. జన గణ మన.. వినగానే ప్రతి భారతీయుడు లేచి నిల్చొని సెల్యూట్ చేస్తారు. జాతీయ జెండాకు వందనం చేసి ఎలుగెత్తి సగర్వంగా ఆలపిస్తారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ఆలపిస్తే ..ఫరవాలేదు .. కానీ అమెరికా సైనికులు పాడితే .. అఖండ భారతవని ఉప్పొంగిపోతుంది. అలాంటి ఘటన యుధ్ అభ్యాస్ 2019లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది.
యుధ్ అభ్యాస్‌లో జన గణ మన
భారత్-అమెరికా రక్షణపరమైన సమన్వయానికి మరింత బలోపేతం చేసేందుకు ‘యుధ్ అభ్యాస్ 2019′ నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ లూయీస్ మెక్‌కార్డ్ వేదికగా ప్రారంభమై 18వ తేదిన ముగిసింది. ఈ క్రమంలో గత వారం అసోం రెజిమెంటల్ మార్చింగ్ పాట ‘బద్దూరామ్ కా బదన్’ కు అమెరికా జవాన్లు కాలు కదిపి స్టెప్పు వేశారు. ఈ సారి ‘జన గణ మన’ ఆలపించారు. అమెరికా సైన్యం ‘జన గణ మన’ అలపిస్తున్న వీడియో చూసి ప్రతి భారతీయుడి మది పులకిస్తోంది.
ఇదీ నేపథ్యం ..
‘బద్దూరామ్ కా బదన్’ అసోం రెజిమెంట్ మార్చింగ్ పాట. దీనికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగేప్పుడు జపాన్‌తో జరిగిన పోరాటంలో బద్దూరామ్ అనే సైనికుడు వీరమరణం పొందారు. ఆ సమయంలో సైనికులకు ఆహారం రేషన్ రూపంలో వచ్చేది. బద్దూరామ్ చనిపోయాడనే విషయాన్ని రెజిమెంట్ అధికారి తెలియజేయలేదు. దీంతో అతని రేషన్ కూడా రెజిమెంట్‌కు వచ్చేది. అదనంగా వచ్చిన రేషన్ యుద్ధం చివరలో గెలుపు ఓటములను శాసించిన సంగతి తెలిసిందే.





