News

పొగిరిలో చారిత్రక ఆనవాళ్లు..

358views

విజయనగరం జిల్లా రాజాం మండల పరిధి పొగిరి గ్రామంలో చారిత్ర ఆనవాళ్లు ఉన్నాయని రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రాజాం చరిత్ర రచనలో భాగంగా ఇటీవల గ్రామాన్ని సందర్శించానన్నారు. ఆ సమయంలో గ్రామం ముందర రోడ్డు పక్కన పురాతన నాగదేవత శిల్పాన్ని గుర్తించామని చెప్పారు. అలాగే గ్రామంలో వెయ్యేళ్ల నాటి అగస్త్యేశ్వర ఆలయం ఉందని తెలిపారు. అందులో ఉండే శివలింగం పురాతనమైన్నారు. అలాగే కోనేరు నుంచి ఉన్నత పాఠశాల వెళ్లే దారిలో ఒక దిబ్బపై వెయ్యేళ్ల నాటి కోవెల శిథిలాలు ఉన్నాయని, అక్కడే ఉన్న చాముండి విగ్రహం కాకతీయుల దేవత కాకతికి చెందిన సప్తమాత్రుకలలో ఒకటని తెలిపారు. ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ ముఖ్యకార్య నిర్వహణ అధికారి ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ చరిత్ర పరిశోధకుడు రామోజ్‌ హరగోపాల్‌కు విగ్రహాల వివరాలు తెలియజేయగా.. అవన్నీ 10,12 శతాబ్దాలకు చెందినవిగా నిర్ధారించారని చెప్పారు. పొగిరిని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు.