News

ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం.. ఆధ్యాత్మిక బస్సు యాత్ర ప్రారంభం

268views

రాజమహేంద్రవరం: స్థానిక సరస్వతీ ఘాట్‌లో ఆధ్యాత్మిక బస్సు యాత్రను మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రారంభించారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం కల్పిస్తున్నారు. తొలుత కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అక్కడినుంచి అన్నవరం సత్యనారాయణస్వామి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాల సందర్శన ఉంటుంది. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌లో గోదావరి హారతితో బస్సు యాత్ర ముగియనుంది. ప్రతి శనివారం ఈ యాత్ర ఉంటుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు.