News

గంటల వ్యవధిలో ఊచకోత

4views

ఆఫ్రికాలోని బుర్కినా ఫోసో దేశంలో జరిగిన అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు బర్సాలోగో పట్టణంలో ఆగష్టు 24న విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 600 మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. మరణించిన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. బైకులపై వచ్చిన ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, గంటల వ్యవధిలోనే 600 మంది ప్రాణాలు బలిగొన్నారనే వార్త ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇస్లామిక్ స్టేట్ రెబెల్స్, అల్‌ఖైదా ఉగ్రవాదుల పనిగా అనుమానిస్తున్నారు.

చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణంపై ఉగ్రవాద సంస్థలు ఇంకా స్పందించలేదు. అంతర్జాతీయ మీడియా కథనాలు ద్వారా ఈ దారుణం వెలుగు చూసింది.