
150views
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగింది.
దంతెవాడ, నారాయణ్‌పుర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి మృతి చెందిన ఏడుగురి మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.