News

తాలిబన్లను ఉగ్రజాబితా నుంచి తొలగించిన రష్యా

22views

ఉగ్రసంస్థ తాలిబన్ల పాలనను రష్యా గుర్తించింది. ఉగ్రవాదుల జాబితా నుంచి తాలిబాన్లను తొలగిస్తున్నట్లు రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్నాక అక్కడ తాలిబన్ల పాలన మొదలైంది. తాలిబన్ల పాలనను చైనా, యూఏఈ మాత్రమే గుర్తించాయి. ప్రపంచ దేశాలన్నీ తాలిబన్లను ఉగ్రవాదులుగానే పరిగణిస్తున్నాయి. తాజాగా రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. తాలిబన్లను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించింది. వారి పాలనను గుర్తించింది.

గత జనవరిలో రష్యా అధ్యక్షుడు తాలిబన్ల పాలన గురించి ప్రస్తావించారు. తాజాగా ఉగ్రజాబితా నుంచి తొలగించడంతోపాటు, ఆఫ్ఘనిస్థాన్‌తో రాజకీయ, వ్యాపార సంబంధాలు కొనసాగుతాయని రష్యా ప్రకటించడం విశేషం.