News

వారధి ఫిర్యాదులో లవ్ జిహాద్ కేసు

20views

ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ‘వారధి’ కార్యక్రమంలో లవ్‌జిహాద్ కేసు వెలుగుచూసింది. శుక్రవారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ సందర్భంగా కడపకు చెందిన లవ్ జిహాద్ కేసు వెలుగు చూసింది.

కడపకు చెందిన రామిరెడ్డి భరత్ భూషణ్ రెడ్డి 2024 జులై 12న కుమార్తెను ఇంట్లో వదిలి భార్యతో బైటకు వెళ్ళారు. వారు 11 గంటలకు తిరిగి వచ్చేసరికి కూతురు ఇంట్లో లేదు. సుమారు 5లక్షల నగదు, 26 తులాల బంగారంతో మాయమైంది. మరో అరగంటకు పోలీస్ స్టేషన్ నుంచి వారికి ఫోన్‌కాల్ వచ్చింది. షేక్ ఫజలుల్లా అనే వ్యక్తి ఆమెను తీసుకువెళ్ళి ఇస్లాంలోకి మతం మార్చి ఇస్లామిక్ పద్ధతిలో ఆమెను పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది.

భరత్‌భూషణ్ రెడ్డి కుమార్తె చెప్పిన వివరాల మేరకు ఫజలుల్లా, ఆమె ఒకే కళాశాలలో చదువుకునేవారు. అక్కడ అతను తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసాడని, వాటితో తనను బ్లాక్‌మెయిల్ చేసి పెళ్ళి చేసుకున్నాడని ఆ అమ్మాయి వెల్లడించింది. ఆ కుట్రలో ఫజుల్లులా మామ షేక్ షమీలుల్లా, అతని రెండవ భార్య బి సునీత, ఎఆర్ కానిస్టేబుల్ ప్రతాప్ భాగస్వామ్యం ఉందని తెలిసింది.

జూలై 14న పోలీసులు బాధితురాలితో మాట్లాడి, ఆమెను వారం రోజులు క్వారంటైన్ హోమ్‌కు పంపాలని నిర్ణయించారు. దానికి ఆమె అంగీకరించింది, తర్వాత తన ఇంటికి వచ్చేస్తానని కూడా చెప్పింది. అయితే ఫజులుల్లా ఆమెను నిర్బంధించాడు. ఆ అమ్మాయికి జులై 16న తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసాడు. విషయం తెలిసిన బాధిత యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు. అయినా పోలీసులు సరిగ్గా కేసు నమోదు చేయనందున ఆ అమ్మాయి పాస్‌పోర్ట్‌కు అప్రూవల్ వచ్చింది. ఇప్పుడామెను సౌదీ అరేబియా తీసుకువెడతున్నారని తెలిసింది. అక్కడ తమ కుమార్తెను అక్రమంగా అమ్మివేస్తాడని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

ఈ లవ్ జిహాద్‌ కేసు గురించి కేంద్ర మంత్రి కడప ఎస్‌పితో, కేంద్ర మంత్రితో ఫోన్ లో సంప్రదించారు. రామిరెడ్డి భరత్ భూషణ్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు.