News

‘మోమిడి’కి జాతీయ ఉత్తమ అవార్డు

35views

చిత్తూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ‘పేదరికం లేని జీవనోపాధి మెరుగ్గా ఉన్న పంచాయతీ, ఆరోగ్యకరమైన, చైల్డ్‌ ఫ్రెండ్లీ, తగినంత నీటి వసతి, పరిశుభ్రత- పచ్చదనం, స్వయం సమృద్ధి- మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం- సురక్షితమైన, సుపరిపాలన, ఉమన్‌ ఫ్రెండ్లీ’ వంటి 9 అంశాలపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోమిడి పంచాయతీకి పరిశుభ్రత- పచ్చదనం విభాగంలో జాతీయస్థాయి అవార్డు వచ్చింది. ఇక్కడి సర్పంచి, పంచాయతీ కార్యదర్శి మహిళలే అయినా, పరిశుభ్రత మెరుగుకు, పచ్చదనం పెంపునకు ప్రత్యేక దృష్టి సారించారు. వీటిపై గ్రామస్తులకు అవగాహన కల్పించి, వారి సహకారంతో పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది.