News

ఆరెస్సెస్ పథసంచలన్‌కి మద్రాసు హైకోర్టు అనుమతి

25views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 58 ప్రాంతాల్లో నిర్వహించే పథ సంచలన్ కి (రూట్ మార్చ్) మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వెంటనే అనుమతులు ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రతి సంవత్సరం కూడా కోర్టు జోక్యం చేసుకోవాలని పోలీసులు తమను కోరడం అనేది సమంజసం కాదని హితవు పలికింది. ఇదే చివరి సారి అని, భవిష్యత్తులో వారితో చర్చలు జరిపి, అనుమతులు మంజూరు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఆరెస్సెస్ స్థాపన అత్యంత పవిత్రమైన విజయదశమి రోజునే జరిగింది. అందుకే ప్రతి సారి స్వయంసేవకులు పథ సంచలన్, విజయదశమి ఉత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. మరీ ముఖ్యంగా ఈ విజయదశమికి సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ సందర్భంగా పథ సంచలన్ కి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది. కానీ… డీఎంకే ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి, ఆరెస్సెస్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకుండా చేస్తోంది.

మరోవైపు తిరుపూర్ ఆరెస్సెస్ స్వయంసేవకులు పథ సంచలన్‌కి అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలివ్వాలంటూ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. విజయదశమి ఉత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 58 ప్రాంతాల్లో అక్టోబర్ 6 న పథ సంచలన్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించాలంటూ ఈ పిటిన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ జి. జయచంద్రన్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు అనుమతులు మంజూరు చేస్తూ, పోలీసులకు చివాట్లు పెట్టింది.