News

ముంబైలో అక్రమ మసీదు నిర్మాణం కూల్చివేత

25views

ముంబైలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు సోమవారంతో గడువు ముగిసింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్య చేపట్టింది.

అక్రమ నిర్మాణం కూల్చివేతలో ముందుగా మసీదుపై అక్రమంగా నిర్మించిన గోపురాన్ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. దీనికిముందు మసీదు ట్రస్టు అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని పచ్చటి పరదాతో కప్పివుంచింది. బీఎంసీ బృందం మసీదును పరిశీలించేందుకు వచ్చి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.

అయితే ఈ మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మసీదు ట్రస్టు స్వయంగా హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో మసీదు కూల్చివేత పనులను సోమవారం ప్రారంభించింది. హిమాచల్‌లోని కులులో అక్రమ మసీదు నిర్మాణంపై హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూణెలో అక్రమంగా నిర్మితమైన మసీదు, మదర్సా కూల్చివేత పనులను పూణే మహానగర పాలక సంస్థ చేపట్టింది