News

విజయవాడ దసరా మహోత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

24views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ ఎం.పి కేశినేని శివనాధ్, పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి తెలిపారు . ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవములు -2024 పోస్టర్ మరియు ఆహ్వానం పత్రికను ఆవిష్కరించారు .ఈ సందర్బంగా వారు మీడియా తో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అక్టోబరు 3వ తేదీన బాలా త్రిపుర సుందరీ దేవి, 4న గాయత్రీదేవి, 5న అన్నపూర్ణాదేవి, 6న లలితా త్రిపుర సుందరీదేవి, 7న మహాచండీ, 8న మహాలక్ష్మి, 9న సరస్వతీ దేవి, 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్ధని, 12న రాజరాజేశ్వరిదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. 9వ తేదీన మూలా నక్షత్రం రోజు సరస్వతీ దేవి అలంకారం సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని. దసరా ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు కలకుండా అన్ని రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.