News

విశాఖలో విత్తనబంతుల కార్యక్రమం

29views

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమీషనర్ కె ఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. విశాఖలోని కైలాసగిరి పై విఎంఆర్ డిఎ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ బృందం నిర్వహించిన విత్తనబంతులు వెదజల్లే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మర్రి, రావి, జువ్వి, చింత, ఏనుగు గురువింద, దిరిసిన, పొగడ, నిద్ర గన్నేరు, గంగ రావి, బాదం, అడవి బాదం, ఫాల్స్ అశోక, అడవి చింత, వేప, కరక్కాయ, ఇండుగ, రేల, తురాయి, రామాఫలం, సీతాఫలం, వేప వంటి దాదాపు 35 రకాలైన వృక్షజాతులకు చెందిన విత్తనాలను మట్టితో చేసిన సుమారు 3000 బంతులను గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, విశాఖ వారి పర్యవేక్షణలో కైలాసగిరి కొండపై వెదజల్లారు‌‌..ఈసందర్భంగా వి.ఎమ్మార్డీఏ కమిషనర్ విశ్వనాధన్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యంతో పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, తద్వార భూతాపం విపరీతంగా పెరిగి ప్రకృతి వైపరీత్యాలు తరచు సంభవిస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జీవ వైవిధ్యం ఉపయోగాలు, ప్రస్తుతం అందులో జరుగుతున్న వివిధ మార్పులు ప్రతిఒక్కరు గుర్తించాలన్నారు.