News

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. షెడ్యూల్ ఇలా

31views

ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ సృజన, సీపీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే సుజనాచౌదరి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని జిల్లా కలెక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు.

మూలా నక్షత్రం రోజున అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని , అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.

దసరా ఉత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ 3న శ్రీ దుర్గమ్మ వారు బాలా త్రిపురసుందరిదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనుంది. అక్టోబర్ 4న గాయత్రీ దేవిగా,
అక్టోబరు 5 న అన్నపూర్ణ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులను అనుగ్రహించనుంది. ఇక అక్టోబరు 6 న లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
అక్టోబరు 7 న మహాచండీ దేవిగా కాటాక్షించనున్న అమ్మవారు, అక్టోబరు 8న శ్రీమహలక్ష్మి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనుంది. అక్టోబర్ 9న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతిదేవిగా అమ్మవారికి అలంకారం చేయనున్నారు.
అక్టోబరు 10 న దుర్గాదేవిగా, అక్టోబరు 11 న మహిషాసుర మర్దినిగా అక్టోబరు 12 శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి అలంకరణ చేస్తారు.