News

సీఏఏ ద్వారా దేశంలోని ఏ ఒక్కరి పౌర సత్వాన్ని తొలగించడం జరగదు

33views

పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ద్వారా దేశంలోని ఏ ఒక్కరి పౌర సత్వాన్ని తొలగించడం జరగదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దానికి బదులు అర్హత కలిగిన పౌరులకు హోదా కల్పించడమే చట్టం చేసే పని అని అన్నారు. సీఏఏ అన్నది పౌరసత్వాన్ని మంజూరు చేయడానికే ఉద్దేశించినది అని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం -సీఏఏ కింద 188 మంది హిందూ ప్రవాసులకు అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పౌరసత్వ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశంలో ఆశ్రయం పొందిన వ్యక్తులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు