News

కేదార్‌‌నాథ్ యాత్ర : ట్రెక్కింగ్ రూట్ లో యాత్రీకులకు అనుమతి

40views

జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో నడక మార్గాన్ని 15 రోజుల తర్వాత తెరిచారు. కొండచరియలు విరిగిపడటంతో 15 రోజుల కిందట ఈ మార్గాన్ని మూసివేశారు. మెరుపు వరదల కారణంగా 19 కిలోమీట‌ర్ల మార్గంలో.. సుమారు 29 ప్ర‌దేశాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దాదాపు 260 మంది కార్మికులు రాత్రీపగులు పనిచేసి ట్రెక్కింగ్ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడైన ఇబ్బందికరపరిస్థితి ఏర్పడితే అక్కడ సహాయ సిబ్బంది భక్తులకు అండగా నిలుస్తున్నారు.

కొండ‌చ‌రియిలు విరిగిప‌డినసమయంలో కేదార్‌నాథ్‌లో వేలాది మంది యాత్రీకులు చిక్కుకుపోయారు. భార‌తీయ వైమానిక ద‌ళం, ప్రైవేటు హెలికాప్ట‌ర్ల‌తో సుమారు 11వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భీంభ‌లి, లించోలీలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు రక్షించాయి. జూలై 31న భారీ వ‌ర్షాల‌తో వరదల సంభవించి కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అప్పటి నుంచి ట్రెక్కింగ్ రూట్ ను మూసివేశారు.