ArticlesNews

బంగ్లాదేశ్‌లో హిందూ నరమేధం: ప్రపంచ హిందువులారా ఏకం కండి, లేదా నశించిపొండి

65views

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధానికి నిరసనగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం మౌన ప్రదర్శన జరిగింది. దేశ రాజధానిలోని మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మహిళలు పాల్గొన్నారు. తమ నోళ్ళకు నల్లటి గుడ్డలు కట్టుకుని, హిందూ మహిళలపై జరిగిన అత్యాచారాల మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తీకరించారు,

ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ మొదలైన ఆందోళనలు చివరికి హిందువులపై దాడులుగా మారాయి. ఏకంగా ప్రధానమంత్రినే గద్దెదింపే కుట్ర చేసారు. ఆమె దేశం వదిలి పారిపోయేంత హింసాత్మకంగా జరిగాయి.

‘‘బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరిగిన దాడులు భారతదేశంలోనూ జరిగే రోజు ఎంతోదూరం లేదు. భారత్‌లోనూ జిహాద్ పేరిట హిందువులను నాశనం చేసే భారీ కుట్ర జరుగుతోంది. అది ల్యాండ్ జిహాద్ కావచ్చు, విద్య ఇస్లామీకరణ కావచ్చు, ఏదోరకంగా హిందువులను మతం మార్చేయడం, నిర్మూలించేయడం అన్న కుట్ర జరుగుతోంది’’ అని మంజూ బన్సల్ అనే మహిళ భయం వ్యక్తం చేసారు.

‘‘ముస్లిములు పెద్దసంఖ్యగా అయిన ఏ చోటనైనా వారు మైనారిటీలను వేధించడం పరిపాటి అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా హిందువుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. బంగ్లాదేశ్‌లో మొదట్లో 20శాతం పైగా ఉండే హిందూ జనాభా ఇప్పుడు సుమారు 3శాతానికి పడిపోయింది. భారతదేశంలో ముస్లిములు తమకు భద్రత లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అయినా వారి జనాభా మనదేశంలో 10శఆతం నుంచి 40శాతానికి పెరిగింది. అందుకే హిందువులు కులాల ప్రాతిపదికన విడిపోకుండా ఐకమత్యంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని కులం ఏమిటి అని అడిగితే హిందువునని మాత్రం చెప్పండి. నేను హిందువునని గర్వంగా చెప్పండి’’ అని మంజు చెప్పారు.

‘‘హిందువులందరూ ఐకమత్యంగా నిలవవలసిన సమయమిది. లేదా బంగ్లాదేశ్‌ లాంటి సంఘటనలను చవిచూడాల్సి వస్తుంది. హిందువులపై, హిందూ దేవాలయాలపై ముస్లిముల దాడులను కొనసాగనివ్వం. ఇప్పుడు వేలాదిమంది చొరబాటుదార్లు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని మరొక మహిళ చెప్పారు.

ఈ నిరసన కార్యక్రమంలో పురుషులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సనాతన ధర్మం శాంతిని ప్రబోధిస్తుందని, సహనాన్ని నేర్పిస్తుందనీ వారు చెబుతున్నారు. ‘‘ప్రపంచంలో 57 ముస్లిం దేశాలున్నాయి, కానీ షేక్‌హసీనాకు ఆశ్రయం ఇచ్చింది భారతదేశం మాత్రమే. పైగా ఆమె ఇక్కడ సురక్షితంగా ఉంటారు’’ అని ఒక ఆందోళనకారుడు వ్యాఖ్యానించాడు.

‘‘భారతదేశంలో ఒకవేళ ముస్లిములు 100 కోట్ల మంది ఉండి, హిందువుల జనసంఖ్య వారికంటె తక్కువ ఉంటే వాళ్ళు భారత్‌ను ఇప్పటికే ఇస్లామిక్ దేశంగా మార్చేసేవారు, హిందువుల మనుగడే కష్టమైపోయి ఉండేది. దేశంలో ముస్లిముల జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. హిందువులు ఇకనైనా మేలుకోకపోతే, వారు అంతరించిపోవలసిందే’’ అని సూరజ్ అనే ఆందోళనకారుడు అభిప్రాయపడ్డారు. ‘‘హిందువులు తమపై గతంలో జరిగిన అరాచకాలను మరచిపోకూడదు. వారిపై 2002లో గోద్రాలోనూ, తాజాగా కశ్మీర్‌లోనూ ఏం జరుగుతోందో గుర్తుంచుకోవాలి’’ అని ఆయన తన భావాన్ని పంచుకున్నారు.

ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ కూడా పాల్గొన్నారు.