News

హర్‌ ఘర్ తిరంగా సర్టిఫికెట్‌ పొందండి ఇలా..

89views

ఆగస్టు 15 (August 15) స్వాతంత్య్ర దినోత్సవం వేడుకులకు భారతావని సిద్ధమవుతోంది. మరి మీరు ఇప్పటివరకూ హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ పొందకపోతే ఇప్పుడు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం హర్‌ ఘర్ తిరంగా 2024 క్యాంపెయిన్ చేపట్టింది. భారత్‌ 77 ఏళ్లు పూర్తి చేసుకుని.. 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో.. ప్రజలు జాతీయ జెండాను గౌరవిస్తూ.. తమ ప్రొఫైల్ ఫొటోగా జెండాను పెట్టుకుంటున్నారు. అలాగే జెండాలతో సెల్ఫీలు తీసుకొని.. ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నారు. మీరు కూడా మీ సెల్ఫీలను https://harghartiranga.com/ వెబ్‌సైట్‌లో షేర్ చెయొచ్చు. అలాగే హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మొదట అధికారిక వెబ్‌సైట్ https://harghartiranga.com/ లోకి వెళ్లాలి. నేవిగేట్ చేసి.. “click to participate” ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మీ పేరు, ఫోన్ నంబర్, రాష్ట్రం, దేశం పేరును ఎంటర్‌ చేయాలి. ఈ ఫారం నింపేటప్పుడు మీరు అక్కడున్న ప్రతిజ్ఞను జాగ్రత్తగా చదవాలి. “I swear that I will hoist the Tricolour, respect the spirit of our brave sons and freedom fighters, and dedicate myself to the development and progress of India.” అని ఉంటుంది. అక్కడ “take pledge” ఎంచుకోవాలి. తర్వాత మిమ్మల్ని మరో పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు త్రివర్ణ జెండాతో దిగిన సెల్ఫీలను పోస్ట్ చేసి.. తర్వాత సబ్‌మిట్ బటన్‌ క్లిక్ చేయాలి. అనంతరం “Generate Certificate” ఆప్షన్ ఎంచుకుని క్లిక్ చేయాలి. మీకు సర్టిఫికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ సర్టిఫికెట్‌ను మీరు మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.