News

భరతనాట్యంలో 13 ఏళ్ల చైనా విద్యార్థిని ‘అరంగేట్రం’

47views

భారతీయ నాట్య వైభవానికి తలమానికమైన భరతనాట్యంలో ‘అరంగేట్రం’ చేయడం ద్వారా చైనాకు చెందిన 13 ఏళ్ల లీ ముజి అనే విద్యార్థిని చరిత్ర సృష్టించింది. ఈ మేరకు బీజింగ్ లో వారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ భరత నాట్య కళాకారిణి లీలా శాంసన్, భారత దౌత్యవేత్తలు, పెద్ద ఎత్తున హాజరైన స్థానికుల ఎదుట లీ భరతనాట్యంలో అరం గేట్ర ప్రదర్శన చేసింది. తద్వారా పూర్తిగా చైనాలోనే శిక్షణ పొంది, ఇక్కడే అరంగేట్రం చేసిన తొలి నర్తకిగా రికార్డు సృష్టించింది. 13 ఏళ్ల లీ ముజి భరతనాట్యంలో పదేళ్లుగా శిక్షణ తీసుకుంటోంది. 1999లో ఢిల్లీలో అరం గేట్రం చేసిన జిన్ షాన్ షాన్ అనే కళాకారిణి లీకి గురువుగా వ్యవహరించారు. ‘నేను ఈ నాట్యంతో ఎప్పుడో ప్రేమలో పడి పోయా. భరతనాట్యం కేవలం ఒక అంద మైన కళ మాత్రమే కాదు భారతీయ సంస్కృతికి ఒక ప్రతిరూపం” అని లీ ముజి అభివ ర్ణించింది. చెన్నైలో ఈ నెలాఖరులో లీ నాట్య ప్రదర్శన జరగనుంది.