News

బంగ్లాదేశ్‌లో హిందువులపై అత్యాచారాలకు నిరసనగా కాశీలో ప్రదర్శన

69views

బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారణాసిలో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఛాందసవాద జిహాదీ ముస్లిముల దారుణాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దుర్మార్గపు దాడుల ఘటనలను విననట్లు నటిస్తున్న ప్రపంచ దేశాల చెవుడు వదిలిపోవాలంటూ భేరీలు వాయించారు. హిందువుల హత్యలు, మహిళల సామూహిక మానభంగాలే జిహాదీ ముస్లిముల చరిత్ర అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

బంగ్లాదేశ్‌లో ఆందోళనలు ఏమీ లేవని, హిందువుల ఊచకోత, హిందూ మహిళలపై అత్యాచారాల కోసం ఆందోళనల కుట్ర పన్నారనీ కాశీలో ఆందోళన చేసిన మహిళలు ఆరోపించారు. ఒక హిందూ మహిళపై 124మంది జిహాదీలు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురించి లౌకికవాదులు, వామపక్షవాదులు నోరెందుకు మెదపడం లేదని నిలదీసారు. హిందూ మహిళల మానభంగాలు, చిన్నారులను చంపి వేలాడదీయడాలు, దేవాలయాలను కాల్చేసిన ఘటనలు భారతదేశానికి ఆందోళన కలిగించే విషయాలని, భారత్ అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలనీ వారు వ్యాఖ్యానించారు. మహిళా ప్రధానమంత్రి అయిన షేక్ హసీనా లోదుస్తులను బహిరంగంగా ప్రదర్శించిన జిహాదీ దుర్మార్గుల సిగ్గుమాలిన చేష్టలు ప్రపంచంలోని మహిళలందరికీ సిగ్గుచేటన్నారు.

బంగ్లాదేశ్‌ హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న అరాచకాలు రాజకీయ విషయం కాదని వారణాసిలో ఆందోళన చేపట్టిన వారు వివరించారు. ప్రపంచంలోని మహిళలందరికీ బంగ్లాదేశీ జిహాదీ శక్తులు బహిరంగంగా సవాల్ విసిరాయని వారు వ్యాఖ్యానించారు. తమ ప్రధానమంత్రి లోదుస్తులనే బైటపెట్టినవారు ఏ మహిళను గౌరవంగా చూస్తారని, మర్యాదగా వదిలిపెడతారనీ ప్రశ్నించారు. ప్రపంచదేశాలన్నీ ఏకమై బంగ్లాదేశ్‌ నుంచి జిహాదీశక్తులను తరిమివేయాలని, వారి ఉనికినే తుడిచిపెట్టేయాలనీ పిలుపునిచ్చారు. చట్టవిరుద్ధమైన పనులు చేయడం, చిన్నపిల్లలను లైంగికంగా హింసించడం, అవి తమ మతం ప్రకారం ధర్మమేనని వాదించడం ఆ ముస్లిములకు అలవాటేనని, వారణాసిలో ర్యాలీ నిర్వహించిన మహిళలు వ్యాఖ్యానించారు.