News

ఫత్వా ప్రేరణతోనే రష్దీ మీద హత్యాయత్నం

39views

ప్రముఖ ఆంగ్లో ఇండియన్ రచయిత సల్మాన్ రష్దీ మీద జరిగిన హత్యాయత్నం ఆయన మీద జారీ చేసిన ఫత్వా మేరకే జరిగిందని తేలింది. ఆగస్ట్ 12,2022న న్యూయార్లో హాదీ మతార్ అనే 24 ఏళ్ల యువకుడు పలుమార్లు కత్తితో పొడిచాడు. దీనితో రష్దీ ఒక కన్ను పోగొట్టుకోవలసి వచ్చింది. ఆ సమయంలో రద్దీని ఇంటర్వ్యూ చేస్తున్న హెన్రీ రీసే కూడా గాయపడ్డాడు. ఇరాన్ సర్వోన్నత నాయకుడు రుహోల్లా కొమేనీ ఆ ఫత్వా జారీ చేసే నాటికి హాదీ పుట్టలేదన్న మాట. హాదీ కూడా అమెరికా పౌరుడే. అక్కడ న్యూజెర్సీలో ఉండేవాడు. అతడి మీద హెజిబుల్లా ఉగ్రవాద సంస్థ సభ్యునిగా నేరారోపణ చేశారు. హెజిబుల్లా అమెరికా నిషేధించిన ఉగ్రవాద సంస్థ. రద్దీ రచన ‘సాటానిక్ వర్సెస్’ నవల 1988లో వెలువడింది. ఆ నవల ప్రవక్తను విమర్శించిందన్న ఆరోపణతో కొమేనీ రష్దీ మీద దైవదూషణ నేరం మోపి, హత్య చేయాలంటూ 1989లో ముస్లిం వర్గానికి ఫత్వా జారీ చేశాడు. ఆ మేరకే రష్దీ హాదీ కత్తితో దారుణంగా పొడిచాడు. హెజిబుల్లా లెబనాన్ కేంద్రంగా పనిచేసే షియా ముస్లిం రాజకీయ పక్షం. షియాలు అధికంగా ఉండే ఇరాన్ దీనికి నిధులు అందిస్తూ ఉంటుంది. అందుకే హాదీని ఉగ్రవాద సంస్థకు చెందిన నేరగాడిగానే విచారణ జరుపుతున్నారు.