ArticlesNews

ఆంధ్ర నాటక రంగ దిగ్గజం బళ్లారి రాఘవ

44views

( ఆగస్టు 2న – బళ్లారి రాఘవ జయంతి )

ఆంధ్ర నాటక రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలికిన నటులు, ప్రయోక్త, నాటక రచయిత బళ్లారి రాఘవగా ప్రసిద్ధికెక్కిన తాడిపత్రి రాఘవాచార్యులు జయంతి ఈరోజు. 1880 ఆగస్టు 2న అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జన్మించారు.కానీ బళ్లారిలో స్థిరనివాసం ఏర్పరచుకోవటం వలన బళ్ళారి రాఘవగా ప్రసిద్ధులయ్యారు.

హరిశ్చంద్ర, బృహన్నల, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, రామరాజు చరిత్ర, రామదాసు మొదలైన నాటకాల ద్వారా తెలుగునాట ప్రసిద్దులైయ్యారు. ప్రఖ్యాత కవి జార్జ్‌ బెర్నార్డ్‌షా ఇంగ్లాండులో మీరు పుట్టుంటే షేక్స్‌ఫియర్‌ కంటే గొప్పవారయ్యే వారు అని బళ్లారి రాఘవ ప్రశంసించారంటే ఆయన నటన ఎంత గొప్పగా ఉంటుందో చెప్పవచ్చు. సహజ నటనకు కొత్త ఒరవడిదిద్ది ప్రాతఃస్మరణీయుడిగా తనదైన ముద్ర వేసుకున్న బళ్లారి రాఘవాచార్యులు 1946 ఏప్రిల్ 16 న తుది శ్వాస విడిచారు. భారత ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది.