News

విశ్వగురువుగా భారత్‌ నిలవాలి

35views

భారతీయ జ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తి చేసి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు స్థానిక ఎన్‌ఎస్‌యూ ఏడీ బిల్డింగ్‌లో బెంగళూరుకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ కంప్యూటింగ్‌ (సీ–డాక్‌), తిరుపతి ఎన్‌ఎస్‌యూ మధ్య ‘విద్యా, జ్ఞానసమూపార్జన, వర్క్‌షాపుల నిర్వహణపై సహాయ సహకారాలు’ అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లడుతూ ఎన్‌ఈపీ–2020 వర్సిటీలో అమలవుతోందని, ఇందులో భాగంగా సీ–డాక్‌తో వర్సిటీ చేపట్టనున్న కార్యక్రమాలు, సహాయసహకారాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. వివిధ విభాగాలపై చర్చించడానికి ఆగస్టు 11 నుంచి మూడురోజుల పాటు వర్క్‌షాపును నిర్వహించి సీ–డాక్‌తో వర్సిటీ పలు అంశాలపైన ఎమ్‌ఓయూ కుదుర్చుకుంటుందన్నారు.