News

అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీలో కాల్పుల కలకలం

41views

ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. కాల్పులలో గాయపడిన ఇద్దరు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఎఎంయు తరచూ ఏదోఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా ఇక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. హోలీ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థులపై మరో వర్గం దాడి చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు సివిల్‌లైన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.

గత మే నెలలోనూ ఎఎంయూలోని ఎస్‌​ఎస్‌ హాల్ క్యాంపస్‌లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక వర్గంవారు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఉదంతం జరిగినప్పుడు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. గాయపడిన బీటెక్ విద్యార్థిని వెంటనే వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందించారు.