News

సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తున్న సంస్థ “భారతీయ మజ్దూర్ సంఘ్”

48views

సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తున్న సంస్థ “భారతీయ మజ్దూర్ సంఘ్” అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,పరిశ్రమలో, యజమానులు మరియు కార్మికులు వేర్వేరు తరగతులు కాదు, ‘థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్’ అనే ఆలోచన మాత్రమే మనల్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. ఇదే విషయాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు.

పరిశ్రమలు అనేది కేవలం ఒక వ్యక్తి మెరుగుదలతో ఏర్పడేవి కావని వీటికి స్నేహపూర్వక, ఆకర్షణీయ గుణం కూడా అవసరమన్నారు. కొంత మంది వ్యక్తుల సొంత డబ్బులు వినియోగించాల్సి వస్తుంది. కొంతమంది వ్యక్తుల స్వేదాన్ని పరిశ్రమలకు వినియోగించాల్సి వస్తుంది. అప్పుడే అదే పరిశ్రమ అనిపించుకుంటుంది మరియు ఉత్పత్తి సాధ్యమౌతుందని చెప్పారు. పారిశ్రామిక వ్యవస్థ గురించి ప్రస్తావించాల్సి వస్తే, శ్రామిక వ్యవస్థ ప్రధాన భూమిక పోషిస్తుందని పారిశ్రామిక రంగాన్ని శ్రామికీకరణ చేయాలని తెలిపారు .ఈ దిశగానే గౌరవనీయ ఠేంగ్డే గారు సైద్ధాంతిక పునాదిని అభివృద్ధి చేశారని అన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది కార్మిక రంగానికి ఒక సైద్ధాంతిక సహకారంఅని తెలిపారు.శ్రామిక ఉత్పాదన రంగం, వ్యవసాయం రంగం, సేవా రంగం, వ్యవస్థీకృత సేవా రంగం, అసంఘటిత సేవా రంగాలలోని బ్లూ కాలర్, వైట్ కాలర్..వీరందరూ, తమలో తాము తరగతులుగా మారకూడదు. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన యజమానులు, కార్మికులు అనే బేధభావాలు ఉండకూడదని చెప్పారు. సమన్వయంతోనే, పరస్పర చర్చల ద్వారా అంశాలను ముందుకు తీసుకెళ్లాలని, జీవనం సంఘర్షణతో కాదు సమన్వయంతోనే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు