News

బంగ్లాదేశ్ నుంచి బాధితులొస్తే ఆశ్రయం కల్పిస్తామన్న మమత….రాష్ట్రాలకు ఆ అధికారం లేదన్న కేంద్రం

59views

బంగ్లాదేశ్ అల్లర్లలో బాధితులైనవారు రాష్ట్రంలోకి వస్తే ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా ఈ విషయంలో వ్యవహరిస్తామని తెలిపారు. ‘నేను బంగ్లాదేశ్ సార్వభౌమత్వం గురించి మాట్లా డటం లేదు. అది కేంద్రానికి సంబంధించింది. కానీ నిస్సహాయులైన ప్రజలు వస్తే మాత్రం మానవతా దృక్పథంతో స్పందిస్తాం’ అని ఆమె
పేర్కొన్నారు. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చే బాధితులకు ఆశ్రయం కల్పిస్తామని మమతా బెనర్జీ హామీ ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. అలాంటి అధికారం రాష్ట్రాలకు ఉండదని స్పష్టం చేసింది. అటువంటి అధికారం కేంద్రానిదేనని, ఆమె వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది.