News

మహాత్ముడే మా దేవర

54views

మహాత్మా గాంధీని దేవుడిగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించి పానకం, ప్రసాదాలు పంచిపెట్టిన అరుదైన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురంలో చోటుచేసుకుంది. 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గ్రామంలో గాంధమ్మ సంబరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రామాలయం ముందు మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి అక్కడే ఆయన చిత్రపటం ఉంచి పండ్లు, ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం గ్రామదేవత గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేసి పూజించారు. సుమారు 370 నివాసాలతో 1200 మందికిపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి మహిళలు ముర్రాటలతో వెళ్లి మేళతాళాలతో అన్ని వీధులు ఊరేగింపుగా వెళ్లి ఎర్రమ్మ, గాంధమ్మ, భూలోకమ్మతల్లి అమ్మవార్లకుళ్లి ముర్రాటలు సమర్పించి చల్లదనం చేశారు. అనంతరం గాంధీ చిత్రపటం వద్ద పూజలు చేశారు.