News

స్వదేశానికి హిందూ పద పాదషాహీ శివాజీ ‘వాఘ్‌నఖ్’

68views

సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయుధం ‘వాఘ్ నఖ్’ లండన్ నుంచి భారత్‌కు చేరింది. మూడున్నత శతాబ్దాల కిందట 1659లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను హతమార్చేందుకు శివాజీ ‘వాఘ్ నఖ్’‌ను ఉపయోగించారు. ఇది పులి గోళ్లలా కనిపించే ఆయుధం. ఇంతకాలం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని తాజాగా ముంబైకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సాంస్కృతిక మంత్రి సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు.

వాఘ్ నఖ్‌ను పశ్చిమ మహారాష్ట్రలోని సతారాలో ఉన్న ఛత్రపతి శివాజీ మ్యూజియంకి తీసుకెళ్లనున్నారు. అక్కడ రేపటి నుంచి అంటే జూలై 19 నుంచి దీనిని ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిట్‌ను సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు ప్రారంభించనున్నారు. ఇది విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంతో ఒప్పందం ప్రకారం మూడు సంవత్సరాల పాటు మహారాష్ట్రలో ప్రదర్శిస్తారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, నాగ్‌పూర్‌లోని సెంట్రల్ మ్యూజియం, కొల్హాపూర్‌లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్, ముంబైలోని సీఎస్ఎంపీఎస్ అనే నాలుగు మ్యూజియంలలో వాఘ్‌నఖ్‌ను ప్రదర్శిస్తారు.

శివాజీ మహారాజ్ 350వ పట్టాభిషేక మహోత్సవం జరిగిన 350 పూర్తైన సందర్భంలో వాఘ్‌నఖ్ భారతదేశానికి తిరిగి రావడంపై సనాతన ధర్ములు హర్షం వ్యక్తం చేస్తున్నారు.