News

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

459views

జగన్మాత దుర్గమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఘాట్‌ రోడ్డు మొత్తం ద్విచక్రవాహనాలు, కార్లతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలు సీతమ్మవారి పాదాల సెంటరు, పున్నమి రెస్టారెంట్‌ సమీపంలో నిలిపి అక్కడి నుంచి దుర్గ గుడికి రావడానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అంచానా.

ఆదాయం రూ.51.03 లక్షలు: దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు దర్శనం టిక్కెట్లు, లడ్డు, పులిహోర ప్రసాదాలు, ఆర్జిత సేవల టిక్కెట్లు విక్రయాలు తదితర సేవల ద్వారా రూ.51,03,032 ఆదాయం ఆదివారం లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.