News

చంద్రుని ఉపరితలంపై అద్భుతం..సోలార్ విండ్ అయాన్ల ఉనికి

69views

చైనా ఇటీవల చంద్రునిపై పరిశోధనలకోసం దక్షిణ ధృవం పైకి పంపిన Change-6లోని ల్యాండర్ కొన్ని సోలార్ విండ్ అయాన్లను గుర్తించింది. వాస్తవానికి చంద్రుని దక్షిణ ధృవంపై మట్టి, రాళ్ల నమూనాను సేకరించి తిరిగి భూమికి పంపేందుకు ప్రయోగించారు. ఇది చంద్రునిపై మట్టి, రాళ్ల నమూనాలతో జూన్ 25 న భూమికి తిరిగి రానుంది. ఈలోపు NILS ల్యాండర్ అద్భుతమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది.సోలార్ విండ్ అయాన్లను గుర్తించి చైనా శాస్త్రవేత్తలకు పంపించింది.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మొట్టమొదటిసారిగా చంద్రుని అవతలి వైపు ప్రతికూలంగా చార్జ్ చేయబడిన అయాన్‌లను గుర్తించినట్లు ప్రకటించింది. చైనా Change-6 అంతరిక్ష నౌకలో పంపబడిన చంద్ర ఉపరితల పరికరంలో దాని ప్రతికూల అయాన్ల ద్వారా వీటిని గుర్తించారు. చంద్రుని దక్షిణ ధ్రువం ఐట్‌కెన్ బేసిన్‌లో జూన్ 2న అంతరిక్ష నౌక చంద్రుని అవతల వైపు దిగింది. ఇది రెండోసారి చైనా సాధించిన ఘనత.

చైనా Change-6 ల్యాండింగ్ తర్వాత NILS ను 280 నిమిషాల తర్వాత క్రియాలశీలకం చేశారు. చంద్ర ఉపరితలంపై సోలార్ విండ్ అయాన్లను కనుగొనడం ద్వారా పరిశోధన ఒక పెద్ద ఆవిష్కరణతో ముగిసింది.