ArticlesNews

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

92views

( జూన్ 4 – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి )

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు… తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నచిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. సాగర సంగమం, స్వాతిముత్యం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు. 40 వేలకు పైగా పాటలు 11 భాషలలోపాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు ఆయన సృష్టించారు. ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు.. కేంద్రం ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పద్మ శ్రీ… పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ గౌరవించింది.