News

చెక్కతో ఉపగ్రహం

108views

జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. మంగోలియా చెక్కతో చేసిన ఈ ఉపగ్రహం నలువైపులా దాదాపు 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించనున్నారు. సాధారణంగా ఉపగ్రహాలు వివిధ రకాల లోహాలతో తయారుచేస్తుంటారు. వీటి శకలాలు పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో సుమిటోమో ఫారెస్ట్రీ అనే సంస్థ సహకారంతో కలపతో ఉపగ్రహం తయారుచేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.