News

అన్నీ సాధ్యమే…

103views

రామకృష్ణపరమహంసను ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు – ‘‘సంసారపు పనులు చేసుకుంటూ భగవంతుడి ఆరాధన సాధ్యమేనా?’’ దానికి సమాధానంగా రామకృష్ణులు ‘‘ఎందుకు సాధ్యం కాదు? గ్రామీణ స్త్రీ వడ్లను దంచడం చూశారుకదా. ఆమె ఒకచేతితో రోకలి పట్టుకుని దంచుతూనే ఉంటుంది. మరోవైపు పిల్లవాడిని సముదా యిస్తుంటుంది. అదే సమయంలో ఇతర వ్యవహారా లకు సంబంధించిన మాటలు చెపుతూనే ఉంటుంది. వ్యాపారపు లెక్కలు చూస్తుంటుంది. అయితే ముఖ్యమైన పని మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతూనే ఉంటుంది. రోగలిపోటు కాస్త అటూఇటుగానైనా రోకలిపోటు పడుతుందని ఆమెకు తెలుసు. అలాగే మనం కూడా సంసారపు పనులు చేసుకుంటూనే మనస్సును భగవంతుడి మీద కేంద్రీకరించి ప్రార్థించాలి’’ అని సమాధానమిచ్చారు.

భగవంతుడి పూజకానీ, సమాజకార్యంకానీ ఎంతటి పనుల మధ్యలోనైనా చేయవచ్చన్నది రామకృష్ణపరమహంస సందేశం.