News

20,000 మంది యువతులకు ప్రశిక్షణ

80views

రాష్ట్ర సేవికా సమితి కార్యవిస్తరణ ప్రశిణా వర్గను నెల్లూరు సమీపంలోని బొడ్డువారిపాలెం ఓవెల్ ఇండియా రెసిడెన్సియల్ పాఠశాలలో మే 15 నుండి మే 30 వ తేది వరకు నిర్వహించారు. ఈ వర్గలో ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల నుండి 75 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు. 27-05-2024న బుచ్చిరెడ్డిపాలెంలో రూట్మార్చ్ (పథసంచలన్) జరిగింది. ముగింపు కార్యక్రమములో ముఖ్యఅతిధిగా డా|| లలితా శిర్డీషా గారు, గౌరవఅతిధిగా శ్రీమతి పి.శ్రీదేవి గారు, మాననీయ అన్నదానం సీతా గాయత్రి గారు పాల్గొని వారి సందేశాన్ని అందించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద యువశక్తిని కలిగిన భారతదేశ సంస్కృతిని కాపాడటానికి ప్రతి సంవత్సరం 20,000 మంది యువతులకు రాష్ట్ర సేవికా సమితి ప్రశిక్షణను ఇస్తోంది. అఖిల భారత ఘోష్ ప్రముఖ్ మాననీయ పంకజ తల్లిగారు, దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహిక మాననీయ సావిత్రి సోమయాజులు గారు, ప్రాంత అధికారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు