News

భక్తిశ్రద్ధలతో అంజనీపుత్రుడి జయంతి

80views

హనుమత్ జయంతి పర్వదినాన్ని ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హనుమాన్ ఆలయాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. హనుమాన్ చాలీసా, రామనామ జపం వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు హనుమాన్ జయంతి నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామికి హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. జపాలి శ్రీ ఆంజనేయ స్వామికి వారికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఎన్టీఆర్ జిల్లా పరిటాలలోని అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని నెంటికంటి అంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద దత్తపీఠంలో ఆంజేయస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేటి సాయంత్రం శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు.